- జిల్లా ఎస్పి అశోక్ కుమార్.
- నెంబర్ ప్లేట్స్ సరిగా లేని 306 వాహనాలను సీజ్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా, నంబర్ ప్లేట్ దాచినా, కొన్ని నంబర్లు తొలగించినా ఇక పై కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ దేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి,కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీస్ టీంలు గా ఏర్పడి ఏక కాలంలో ముమ్మర తనిఖీ లుచేశారు.ఈ సందర్భంగా సరైన నెంబర్ ప్లేట్స్ లేని 306 వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలను, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వాటికి సరైన నెంబర్ ప్లేట్లను బిగించి విడిచి పెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిబందనలకు విరుద్దంగా, ఇష్టారీతిన వాహన నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ ఈ చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నంబర్ తో పాటు తప్పుడు నంబర్ లు ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్ష రాలు గుర్తించలేనంతగా ఉంటున్నాయని, కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా నెంబర్ ప్లేట్ విరగ్గొట్టడం జరిగిందని అన్నారు. ఇలాంటి వారు వాహన తనిఖీల్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాల నెంబర్ ప్లేట్స్ నిబందనల ప్రకారం బిగించు కోవాలని, నిబందనలకు విరుద్దంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి వాహనం నడిపితే వాహనదారుడి పై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని ఎస్పి సూచించారు.నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా ఈ తనిఖీలు నిరంతర నిర్వహించడం జరుగుతుందని, జిల్లా ప్రజలు అందరు పోలీస్ లకు సహకరించలని కోరారు.
