మంథని, ముద్ర విలేఖరి: ఆషాడ మాసం, వ్యాస పౌర్ణమిని పురస్కరించుకొని మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మారుపాక ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవా రికి ప్రత్యేక అభిషేకం, అర్చన, పూజలు నిర్వహించారు.అమ్మవారి మూలవిరాట్ తో పాటు ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల కూరగాయలు, పూలతో అలంకరించారు. మహిళలు సామూహిక శ్రీ లలితా పారాయణాన్ని నిర్వహించారు.భక్తులు ప్రత్యేక భజనలు చేశారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగా వారికి తీర్థ అన్నప్రసాదాల వితరణ చేశారు.