ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
……………………………………….
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యే లకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.మంగళవారం హైదరాబాద్ లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వంశీ కృష్ణ, రాజేష్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి,నారాయణ పేట మాజీ డీసీసీ అధ్యక్షులు కుంభం, శివకుమార్ రెడ్డి లతో సీఎం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా సీఎం మాట్లాడారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే జిల్లాలోని ఇతర పెండింగ్ ప్రాజెక్టుల భూసేకరణను కూడా వేగవంతం చేయాలన్నారు. భూసేకరణ నిధుల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూస్తామని, పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పురోగతిని జిల్లా మంత్రులు, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనుల్లో వేగం పెంచాలన్నారు. పాలమూరు జిల్లా సస్యశ్యామలం కావడానికి, రైతాంగ సంక్షేమం కోసం ఇంతటి ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తో పనిచేయాలని కోరారు.ఈ ప్రాజెక్టు ల కు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ఆదేశించారు.జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలయినంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలన్నారు.
జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యే జిల్లాలోని ఇతర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు.జిల్లాలో సమస్యల పరిష్కారం, పనుల్లో పురోగతిపై మంత్రుల ఆధ్వర్యంలో తరుచూ తనను కలవాలని సీఎం కోరారు.అందరం కలిసి పాలమూరు జిల్లా ను ప్రగతి పథం లో నడిపేందుకు కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ పనులు పూర్తి అవుతే జిల్లా లో సాగునీరు పుష్కలంగా దొరుకుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టు లన్నీ తన హయాంలో పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం ప్రకటించారు.
……………………………………
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.