Take a fresh look at your lifestyle.

మంత్రి వివేక్ సన్మానానికి తరలిరండి

  • మాల సంఘం నాయకుల పిలుపు.

యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: ఆగస్టు 2న రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆత్మీయ పౌర సన్మాన కార్యక్రమం చేపట్టినట్లు మాల సంఘం గోదావరిఖని పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోగాల వెంకటీ, మర్రి ఐలయ్య సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పౌర సన్మాన కార్యక్రమ వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ వాల్ పోస్టర్ల విడుదల కార్యక్రమంలో జన విజ్ఞాన పరిషత్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు ఎరుకల లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు అందుగుల రాజేశం, సంఘం సమన్వయకర్త నంది నరేష్, సీనియర్ నాయకులు ముక్క సుదర్శన్, అందుగుల లింగయ్య, దాసరి రాజు, ఎరుకల లింగమూర్తి, దాసరి రమేష్, వెంకటేశ్వర్లు, సందీప్ పాల్గొన్నారని వారు వివరించారు. జిల్లా కేంద్రం పెద్దపల్లి లో జరిగే ఆత్మీయ పౌర సన్మానం కార్యక్రమానికి తరలి రావాలని నాయకులు సంఘం సభ్యులకు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.