Take a fresh look at your lifestyle.

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ముద్ర న్యూస్, ధర్మపురి:

రాష్ట్రంలోని ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా హకు చెందిన పలువురు ఆశ వర్కర్లు గురువారం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరిని కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఆశ వర్కర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సుముఖంగా ఉన్నారని మంత్రి తెలిపారు. దశలవారీగా ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి ఆశ వర్కర్లకు హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.