Take a fresh look at your lifestyle.

ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

 

ముద్ర, గద్వాల:

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్ ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల నెలవారి సాధారణ తనిఖీలో భాగంగా బుధవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు. సందర్శనలో భాగంగా తనిఖీ రిజిస్టర్ లో కలెక్టర్ సంతకాలు చేశారు.

ఈ తనిఖీలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మంజుల, గద్వాల తహసీల్దార్ హరికృష్ణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.