సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :పదవుల కోసం కాదు, సమస్యల పరిష్కారం అన్న నినాదంతో ముందుకు వస్తున్న విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, తన 19 సంవత్సరాల ఉద్యోగానికి రాజీనామా చేసి.. నిరుద్యోగుల, ఉద్యోగుల అండగా ఉండటానికి ముందుకు వచ్చిన ప్రసన్న హరికృష్ణను గెలిపించి,శాసనమండలికి పంపాలని నిరుద్యోగ హక్కుల నేత,అశోక అకాడమీ డైరెక్టర్ అశోక్ కుమార్ సార్ పిలుపునిచ్చారు.మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్ నిరుద్యోగులు ఉద్యోగులు పట్టబద్రులు బిఎస్పి బలపరిచిన అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కు 3వ నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన నిరుద్యోగ సమస్యలు ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నాయి. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కేవలం 12000 ఉద్యోగాలే ఇప్పటివరకు నింపడం జరిగింది.అలాగే ఉద్యోగులకు సంబంధించి 317 జీవో తీసుకొచ్చి ఇబ్బందుల గురి చేశారు.అలాగే ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఇవాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి.
ఈ విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడే నాథుడే కరవవుతున్నాడు.ఓయూ విద్యార్థి గౌస్ మాట్లాడుతూ 19 సంవత్సరాలుగా ఉద్యోగ జీవితాన్ని కొనసాగించిన, అలాగే ఒక లెక్చరర్ గా పనిచేసినటువంటి ప్రసన్న హరి కృష్ణకి నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి, మేధావి యూనివర్సిటీలలో చదువుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి ప్రసన్నను గెలిపిస్తే చట్టసభల్లో వాళ్ళ తరఫున తమ వానిని వినిపించి వాళ్ళ గలాన్ని వినిపించి, వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఆయన ముందుండి పోరాడుతారని మీకు స్పష్టంగా చెబుతున్నాను. డబ్బుల సంచులతో వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ వ్యక్తులను గెలిపిస్తే వాళ్ల ఆస్తులు పెరుగుతాయి తప్ప.. సమస్యలు పరిష్కారం కావన్నారు. ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడి మూత పడుతుంది, కార్పొరేట్ రాజ్యమేలుతుంది. GO.46, Go.29, Go.317 లతో నిరుద్యోగులను, ఉద్యోగులను రోడ్డున పడేశారన్నారు.ఓయూ విద్యార్థి నేత సుకేశ్, జగదీశ్, ప్రణీత్, రంజీత్ పాల్గొన్నారు.