Take a fresh look at your lifestyle.

ఇబ్రహీంపట్నం కేజీ బివి హాస్టల్ ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా: మంగళవారం రాత్రి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇబ్రహీంపట్నం లోని కెజిబివి హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వసతి గృహంలోని స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, స్టడీ రూమ్, టాయిలెట్స్, తరగతి గదులు,పరిసరాలను పరిశీలించారు,ఉదయం అల్పాహారం,మధ్యాహ్నం భోజనం,రాత్రి భోజనం, మెనూ ప్రకారం పక్కాగా అమలు చేస్తూ నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు.విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడానికి ప్రతి సబ్జెక్టు వారిగా ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య బోధనలు అందించాలన్నారు.భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ భోజనం సిద్ధం చేయాలన్నారు,వసతి గృహాల పరిసరాలలో సానిటేషన్ చేస్తూ పరిశుభ్రముగా ఉంచుకోవాలని సూచించారు.అదనపు కలెక్టర్ వెంట సంబంధిత స్పెషల్ అధికారి, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.