Take a fresh look at your lifestyle.

రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించండి – మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి

 

ముద్ర మల్కాజ్గిరి:

రహదారులపై ట్రాఫిక్‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఆక్రమణలను తొలగించాలని మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.
నేరెడ్మెట్ వార్డ్ కార్యాలయం పరిసరాలు , వాయుపురి .లెక్షన్ ,ట్రాన్స్‌పోర్ట్ యూనిట్ వద్ద ఎంఎంసీ కమిషనర్, డీసీ, డీఈ, ఏఈ, టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు రామ్‌కీ ప్రతినిధులతో కలిసి విస్తృతంగా పరిశీలనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు ముఖ్య అంశాలపై సమీక్ష చేపట్టారు. ఈ-వెస్ట్ సేకరణ కార్యక్రమం పురోగతిని పరిశీలించగా, ట్రాన్స్‌ఫార్మర్‌ల సమీప ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై ట్రాఫిక్‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఆక్రమణలను తొలగించాలని సూచించారు.
అదేవిధంగా, వర్షపు నీటి కాల్వ పైప్‌లైన్ పనులను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వాయుపురి సెకండరీ కలెక్షన్ యూనిట్‌లో జరుగుతున్న కార్యకలాపాలను కూడా సమీక్షించారు.
పరిశుభ్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సమర్థవంతమైన వ్యర్థ నిర్వహణపై తమ నిబద్ధతను అధికారులు పునరుద్ఘాటించారు.

Leave A Reply

Your email address will not be published.