మహేశ్వరం ముద్ర ప్రతినిధి: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రక్షణ, భద్రత చర్యలో భాగంగా అత్యుత్తమ సేవలు అందించిన బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఉత్తమ సేవ ప్రశంస పత్రం అందజేశారు. బుధవారం ఎయిర్ పోర్ట్ లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ సేవ పత్రం బిఎంసి కమిషనర్ పి.సరస్వతికి, చీఫ్ ఆపరేటింగ్ అధికారి అరుణ్ బెహల్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సరస్వతి మాట్లాడుతూ..రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రత రక్షణ చర్యలు భాగంగా మంచి సేవలు అందించిన బడంగ్పేట్ కార్పొరేషన్ కు అత్యుత్తమ సేవ పత్రం లభించడం అభినందనీయం అన్నారు ఈ ప్రశంస పత్రాన్ని మా అధికారులతో కలిసి అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఎంసి ఏఏంసి వి.శ్యామ్ సుందర్, మేనేజర్ బి.నాగేశ్వర్ రావు, అర్ఓ వి. వేణుగోపాల్ రెడ్డి, డిఈ వెంకన్న, ఏఈ వినిల్ గౌడ్,సీనియర్ అసిస్టెంట్ స్అనూష రెడ్డి, మమత రెడ్డి, మౌనిక తదితరులు పాల్గొన్నారు