- ఊరేగింపులో పాల్గొన్న పీయేసీ ఛైర్మెన్ గాంధీ.
మాదాపూర్, ముద్ర: శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానము లో జరిగిన శ్రీ సీతారాముల పట్టాభిషేకం మహోత్సవం కార్యక్రమంలో బాగంగా భక్తులు రథయాత్ర నిర్వహించారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాయినేనీ చంద్రకాంత్ రావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి రథయాత్ర ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీయేసీసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్భంగా చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినం తదనంతరం జరిగే సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమం తదనంతరం నిర్వహించిన రథయాత్ర ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా సప్తగిరి, వివేకానంద నగర్ కాలనీలలో పురవీధులలో ఘనంగా ఉరేగింపు నిర్వహించారు.అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ప్రజల మధ్య ఎంతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కొనసాగింది.ఆధ్యాత్మికం వెల్లివిరియగా పుర విధులలో రామ నామం తో, జై శ్రీరామ్ నినాదాలతో వీధిలన్నీ మార్మోగాయి.రథ యాత్ర అంగరంగ వైభవంగా జరిగిందింటూ అని చైర్మన్ గాంధీ ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, శర్మ, దేవి నేనీ ప్రసాద్,చంద్రశేఖర్ హర్ష, ప్రదీప్, కార్యకర్తలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
