బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం బోథ్ నియోజకవర్గం లోని పిప్పిరి లో జరిగిన బహిరంగ సభలో సీఎం దృష్టికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పలు సమస్యలను ప్రస్తావించారు. గతంలో పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలలో కొన్నిటిని సీఎం సభ వేదికగాా ప్రారంభం చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గానికి యంగ్ ఇండియా స్కూల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు, పిప్రి, తేజాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే హర్షం ప్రకటించారు. ఆనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బోథ్‌లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు దగ్గర చేయాలని,బుగ్గారం, సుంకిడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు 22 కొత్త చెరువుల నిర్మాణం, 18 చెరువులకు మరమ్మతులతో పాటు 23 చెక్ డ్యాం ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దేగామా ప్రాజెక్ట్ నిర్వాసితులైన 200 కుటుంబాలకు పునరావాసం కింద ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. బోథ్ సెంట్రల్ లైటింగ్,రింగ్ రోడ్డు కోసం – 43 కోట్లు కేటాయించాలని, ఇచ్చోడ –సిరికొండ డబుల్ రోడ్డు, సిరిచేల్మ – పులగం పండ్రి భరంపూర్ – మోర్కండి, జందాపూర్ – కరంజి రోడ్డునిలిచిపోయిన రోడ్డు పనులను పూర్తి చేసి కొత్త రోడ్లకు నిధులు కేటాయించాలని కోరారు
నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్, తలమడుగు, సోనాల, భీంపూర్, సిరికొండ మండలాల్లో ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు నిర్మించాలని కోరారు.
బోథ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు
బోథ్ లో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. కుంటాల, గాయత్రి, పొచ్చెర, కనకాయి జలపాతాలను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని కోరారు.