మోత్కూరు ముద్ర న్యూస్ :మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వీపర్ గా పనిచేసి కీర్తిశేషులైన ఇట్టబోయిన లచ్చయ్య జ్ఞాపకార్థం సతీమణి మంగమ్మ సోమ వారం ప్రత్యేక తరగతులు హాజరైన పదవ, తొమ్మిదవ తరగతి (120) మంది విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అరవిందరాయుడు మాట్లాడుతూ లచ్చయ్య అంకిత భావంతో పనిచేశాడని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో లచ్చయ్య కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.