ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలను చేరాలన్నారు. కళాశాల కొత్త భవనం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మన జిల్లాకు యూనివర్సిటీ రావడం గర్వకారణమన్నారు. ఉత్తమ శ్రేణులను పొందిన విద్యార్థులకు బంగారు పతకాలను అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ డా. యు గంగాధర్, డాక్టర్ ఏ రంజిత్ కుమార్, ఎం ఓ నాగశ్రీనివాస్, అర్చన, డా. పిజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.