ముద్ర ప్రతినిధి, భువనగిరి :
బీబీనగర్ మండలం పడమటి సోమవారం గ్రామంలో శ్రీ లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గాదె కవిత నరేందర్ రెడ్డి.
ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని శాలువాతో ఆలయ కమిటీ చైర్మన్ సత్కరించి తీర్ధ ప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యెర్కలా సుధాకర్ గౌడ్,రైతు బందు సమితి అధ్యక్షులు బొక్క జైపాల్ రెడ్డి,ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్, బీబీనగర్ మండల్ పార్టీ అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్ పడమటి సోమరం సర్పంచ్ బద్దం అంజయ్య మరియు ఉప సర్పంచ్ తంతరపల్లి ప్రదీప్ కుమార్ గౌడ్ , బీబీనగర్ మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచాల రవికుమార్ ,రహీం ఖాన్ గూడ సర్పంచ్ నవ్వ శృతి అరవింద్ గారు ,లోకదాస్ ఉప్పలయ్య, కట్ట మాయ గౌడ్ పాల్గొన్నారు.