మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ అంబిర్ చెరువు ఔట్ లెట్ (తూము) స్థితిగతులను కూతుబుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, గౌరవ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, మరియు ఇరిగేషన్ అధికారుల తో కలిసి చెరువు ఔట్ లెట్ (తూము) స్థితిగతులను పరిశీలించిన పీయేసీ చైర్మన్ ఆరెక పూడి గాంధీ ఈ సందర్బంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అంబిర్ చెరువు పూర్తిగా నిండు కుండల నిండు కుంది అని, ఔట్ లెట్ వద్ద పరిస్థితిని మరియు చెరువు కట్ట సామర్థ్యం ను పరిశీలించి, అని ఔట్ లెట్ ద్వారా వెలువడుతున్న నీటి ప్రవాహం ద్వారా చెరువు దిగువున గల కాలనీ లు, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా ఇరిగేషన్ అధికారులు ముందస్తు తగు చర్యలు తీసుకోవాలని, తూము ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండలని, వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చైర్మన్ గాంధీ సూచించారు.అంబిర్ చెరువు సుందరీ కరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు తుది దశలో ఉన్నవి అని, అంబిర్ చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది అని, చెరువు చుట్టుపక్కల ప్రజల విజ్ఞప్తి మేరకు గుర్రపు డెక్క ద్వారా తొలగింపు కార్యక్రమం చేపట్టడం జరిగినది అని, గుర్రపు డెక్క తొలగింపు పనులలో వేగం పెంచాలని,త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడలని, గుర్రపు డెక్క తొలగింపు ద్వారా దోమల బెడద తగ్గునని చైర్మన్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని చైర్మన్ గాంధీ గారు పేర్కొన్నారు చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా ప్రణాళిక తో పనులు చేపట్టాలని చైర్మన్ గాంధీ అన్నారు.అదేవిధంగా చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. అదేవిధంగా అంబిర్ చెరువును సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.అదేవిధంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పడం జరిగినది, తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని PAC చైర్మన్ గాంధీ గారు చెప్పటం జరిగినది.చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని,చెరువులు కలుషితం కాకుండా మరియు కబ్జాలకు గురికాకుండా చెరువులను పూర్తి స్థాయి లోసంరక్షిస్తామని చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయిస్తామ్మన్నారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డీఈ నరేందర్, ఏయి లక్ష్మీ నారాయణ మరియు నాయకులు రంగరాయ ప్రసాద్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దొడ్ల రామ కృష్ణ గౌడ్, ఇబ్రహీం, జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
