Take a fresh look at your lifestyle.

ప్రపంచమంతా తెలంగాణ బిడ్డలు గర్వపడేలా బోనాలు

  •  జెట్టి కుసుమ్ కుమారుని కలిసిన చైర్మన్ చంటిబాబు
  •  టిపిసిసి నాయకులు మధుజష్కి గౌడును ఆహ్వానిస్తున్న చంటిబాబు

మెహదీపట్నం ముద్ర : ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు గర్వపడేలా అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని ఎఐసిసి నాయకులు కుసుమ్ కుమార్, టిపిసిసి నాయకులు మధు యాష్ కి గౌడులు అన్నారు. ఈనెల 26 నుండి తెలంగాణలో ప్రధమంగా ప్రారంభమయ్యే గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలంటూ ఆలయ కమిటీ చైర్మన్ కొండెపూడి చంటిబాబు ఆధ్వర్యంలో పలువురు నాయకులను కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. తెలంగాణ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత తెలిపేందుకు బోనాల ఉత్సవాలు అంబరాన్నంటెల నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలకు మరింత మేలు కలగాలని పూజలు నిర్వహించనున్నామన్నారు. వారిని కలిసిన వారిలో నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఉస్మాన్ హాజ్రి, ఆకుల శేఖర్, ప్రదీప్ కుమార్, శ్రీకాంత్ యాదవ్, సంతోష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.