విద్యార్థులతో కలిసి మంత్రి అల్పాహారం…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి నివేదనలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థులతో కలిసి గురువారం అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై వారి అభ్యాస పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహార నాణ్యతపై ఆరా తీశారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, గురుకుల విద్యాసంస్థలను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులు తమకు అందుతున్న సదుపాయాలపై తమ అభిప్రాయాలను వెల్లడించగా, అధికారులను త్వరితగతిన పరిష్కరించుటకు మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మెన్ సంగనబట్ల దినేష్, ఆర్‌డీవో మధుసూదన్, డీసీసీ అధ్యక్షులు నందయ్య, కౌన్సిలర్లు దుమాల రాజ్ కుమార్, బడుగు పద్మ రాజేందర్, బొల్లరపు స్వప్న గిరిధర్, ఖాజా కమలుద్దిన్, మాజీ చైర్మెన్ గిరి నాగభూషణం, నాయకులు బండ శంకర్, దయాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.