Take a fresh look at your lifestyle.

డిజైన్, నిర్మాణ లోపంతోనే కాలేశ్వరం కూలింది

  • ఘోర మానవ నిర్మిత విపత్తును బీఆర్​ఎస్ సృష్టించింది.
  • సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం.
  • డిజైన్​, నిర్మాణ లోపం, మెయింటనెన్స్​ లోపాలతోనే ఆ ప్రాజెక్టు కుప్పకూలింది.
  • అధికారంలో ఉన్న వారు జోక్యం పెరిగింది.
  • ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వం కాళేశ్వరం పేరిట ఘోర మానవ నిర్మిత విపత్తును సృష్టించిందని రాష్ట్ర ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు.ఈ ప్రాజెక్టుతో బీఆర్​ఎస్​ మూటగట్టుకున్న అపఖ్యాతి గత ప్రభుత్వ అసమర్థతను నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) తన నివేదికలో స్పష్టం చేసిందని చెప్పారు.బీఆర్ఎస్ హయాంలో కమీషన్ల కక్కుర్తితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రభుత్వంలోనే కుప్పకూలిందని మండిపడ్డారు.ఈ పరిణామాలు చూసి బీఆర్​ఎస్​ నేతలు సిగ్గుతో తలదించుకోవాలని చురకలంటించారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన తుది నివేదికపై మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, ఆపరేషన్ అండర్ మెయింటెనెన్స్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ స్పష్టమైన రిపోర్టు ఇచ్చిందని తెలిపారు.ఇప్పటికైనా సిగ్గుతో తలదించుకుని క్షమాపణలు చెప్పాల్సింది పోయి అసలు ఎన్డీఎస్ఏ రిపోర్టునే బీఆర్ఎస్ తప్పుబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోరమైన మానవ నిర్మిత విపత్తును సృష్టించి అపఖ్యాతిని మూటగట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థతను ఈ నివేదిక స్పష్టంగా వివరించిందన్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోనూ లోపాలు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసిందని మంత్రి తెలిపారు. డీపీఆర్ తయారీకి తగిన సమయం ఇవ్వకుండా హడావుడి చేశారని, దాంతో పనితనంపై గత ప్రభుత్వం రాజీపడిందని నివేదిక స్పష్టం చేసిందన్నారు. డీపీఆర్‌లో అనుకున్న దానికి భిన్నంగా బ్యారేజీల నిర్మాణ సమయంలో అసాధారణమైన,గణనీయమైన మార్పులు జరిగాయని చెప్పారు.నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలాన్ని వరుసగా 2.2 కి.మీ. 5.4 కిలోమీటర్లు దిగువకు మార్చారని తెలిపారు.ఈ రెండు బ్యారేజీల కొత్త ప్రదేశాలు నది పరీవాహక మట్టానికి దిగువన ఉండటం చాలా అసాధారణమన్నారు.దాంతో అన్నారం బ్యారేజీకి ఎగువన భారీగా ఇసుక మేటలు వేశాయని నివేదిక పేర్కొన్నదని చెప్పారు.మూడు బ్యారేజీలలో షీట్ పైల్స్ స్థానంలో సీకెంట్ పైల్స్ వచ్చాయని సీబీఐపీ మార్గదర్శకాల ప్రకారం జియోటెక్నికల్ పరిశోధనల కోసం 85 బోర్ హోల్స్ అవసరం కాగా కేవలం 6 బోర్ హోల్స్ మాత్రమే తవ్వారన్నారు.సీడీవోపై అధికారంలో ఉన్నవాళ్లు నిరంతర జోక్యం చేసుకున్నట్లు నివేదిక స్పష్టం చేసిందన్నారు.

  • ప్రారంభానికి ముందే మేడిగడ్డ లోపాలు..

ఎక్కువ కమీషన్లు వస్తాయని గత ప్రభుత్వ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని మంత్రి ఆరోపించారు.అందుకే అంచనాలు భారీగా పెంచారన్నారు.రూ.80 వేల కోట్ల అనుమతులు తీసుకుని రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు.వివిధ పేర్లతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తీసుకున్నారన్నారు.బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ మొదటి నివేదిక ఇచ్చిందని, ఇప్పుడు వచ్చిన తుది నివేదికలోనూ ఇదే విషయం వెల్లడించిందని ఉత్తమ్ వివరించారు.మేడిగడ్డ ప్రారంభానికి ముందే ప్రాజెక్టులో లోపాలు బయటపడ్డాయన్నారు.కానీ ఆసమయంలో బీఆర్ఎస్ ఒప్పుకోలేదన్నారు.దాంతో తీవ్ర ఆర్ధిక నష్టం జరిగిందన్నారు.తమ్మిడిహెట్టిని కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించడమే ప్రధాన లోపం అని ఎన్డీఎస్ఏ చెప్పిన విషయాన్ని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారు.మేడిగడ్డ ప్రతిపాదనను చూసిన సీడబ్ల్యూసీ దాన్ని ప్రారంభంలోనే తోసిపుచ్చిందని ఉత్తమ్ తెలిపారు.బ్యారేజీ నిర్మాణానికి మట్టి పరీక్షలు, నాణ్యత పరీక్షలు వంటివి ఏమీ చేయలేదని మంత్రి ఆరోపించారు.లోపాలు ఉన్నాయని ఇంజినీర్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు.తమ్మిడిహట్టి మార్పుతోనే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు నష్టం జరిగిందని ఉత్తమ్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.