Take a fresh look at your lifestyle.

అత్యధిక సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ

ముద్ర, గద్వాల:
ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా బీజేపీ పార్టీ నిలిచిందని బిజెపి పార్టీ‌ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు‌. శనివారం గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 5 వ తేదీన ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగురవేసి సోషల్ మీడియాలో సరళ యాప్లో ఆప్లోడ్ చేయాలని అన్నారు. ఏప్రిల్ 6వ తేదీన ప్రతి పోలింగ్ బూత్ లో 5మంది కి తప్పకుండా ఇంటిపై బిజెపి జెండా ఎగరవేయలని అన్నారు..
ఏప్రిల్‌ 5 నుంచి 7 వరకూ ప్రతి బీజేపీ కార్యకర్త ఇంటిపై పార్టీ జెండాను ఆవిష్కరించి, సీనియర్‌ కార్యకర్తల్ని సత్కరించాలి అని అన్నారు. గావ్‌ చలో అభియాన్‌ పేరుతో ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధివిధానాలు వివరిస్తూ దేశ సేవలో బీజేపీ విజయాలను ప్రచారం చేయాలి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలి అని సూచించారు.
అలాగే మండల కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రతి పోలింగ్ బూత్ లలో జెండా ఎగర వేయాలని అన్నారు.

ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా 13 తేదీన సాయంత్రం కొవ్వొత్తులతో నివాళులర్పించి అని, ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ విగ్రహాలను పూలమాలతో అలంకరించి నివాళులు అర్పించి, ఆయన జీవిత విశేషాలతో పాటు సామాజిక న్యాయంపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి’ సూచించారు‌.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావ్, పట్టణ అధ్యక్షురాలు రజక జయ శ్రీ, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దాస్ ,రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు అనిల్, మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, శ్రీనివాసులు, బిజెపి నాయకులు డిల్లీ వాల కృష్ణ, శ్రీనివాసులు ,అక్బర్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.