ముద్ర, మిర్డొడ్డి: మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డిఆర్డిఓ ఏపీ డి ప్రకాష్ అన్నారు మంగళవారం మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు మహారాణుల పనిచేసి వారి కుటుంబాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పనిచేయాలని సూచించారు. మహిళలు అనుకుంటే సాధించండి ఏదీ లేదని ఆయన అన్నారు. మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకొని ప్రతి నెల చెల్లించని వారికి ఎంతో ఆదాయం వస్తుందన్నారు ప్రభుత్వం మహిళలకు అండగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. మహిళలు ప్రతి బిజినెస్ చేసి వారి కుటుంబంతో పాటు మండలాన్ని జిల్లాలో మంచి స్థానంలో ఉంచాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగ్యసాములై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. మహిళలకు రుణం తీసుకున్న వారికి ప్రమాదవశాత్తు మరణించిన ప్రభుత్వం వారి రుణం మాఫీతో పాటు వారికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలను అందించడం జరుగుతుందని తెలిపారు ప్రతి మహిళా తప్పనిసరిగా రుణం పొందే ఉండాలని అన్నారు శ్రీనిధి ద్వారా మహిళలకు అనేక రకాలుగా రుణాలను అందించడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రసాద్ రావు , జిల్లా సమైక్య కార్యదర్శి గౌతమి, అరుణ, నవనీత ఐకెపి సీసీలు వైకుంఠం బాలరాజు సిద్ధిరాములు మణెమ్మ దేవదాస్ శ్రీనివాస్ తో పాటు వివోఏలు మహేష్ , వివో లీడర్లు తదితరులు పాల్గొన్నారు.
