ముద్ర, మిర్దొడ్డీ: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని పంచాయతీ కార్యదర్శి షాహిని బేగం పాఠశాల ఉపాధ్యాయుడు బాలకిషన్ వివో ఏ మహేష్ లు అన్నారు. మంగళవారం మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామపంచాయతీ మహిళా భవనం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటింటా 5 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని వారు అన్నారు మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన గాలి వస్తుందని తెలిపారు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. గ్రామంలో పరిశుభ్రతతో ఉంచాలని తెలిపారు. ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయులు అనురాధ ఆశా వర్కర్ బాలమని తో పాటు మహిళా సంఘం సభ్యులు గ్రామస్తులు భాస్కర్, రవి తోపాటు తదితరులు పాల్గొన్నారు.