ముద్ర, చేర్యాల: చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధనకై జేఏసీ తలపెట్టిన చేర్యాల,మద్దూరు కొమరవెల్లి,దూలమిట్ట మండల కేంద్రాలలో స్వచ్ఛందంగా సంపూర్ణంగా సాగుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి జెఎసి నాయకులు రోడ్లపైకి వచ్చి బైక్ ర్యాలీతోపాటు పాదయాత్ర ద్వారా జై చేర్యాల జై రెవెన్యూ డివిజన్ అంటూ నినాదాలతో ప్రాంత ప్రజల ఆకాంక్షను ఆత్మగౌరాన్ని తెలుపుతూ స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సంస్థలు అలాగే చిరు వ్యాపార సంస్థలు ఈ బందులో పాల్గొన్నారు. జేఏసీ అధ్యక్షుడు రామగల పరమేశ్వర్ మాట్లాడుతూ చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేంతవరకు ఈ పోరాటం ఆగదని 2025 సంవత్సరం ముగిసేలోపు డివిజన్ గా ప్రకటించాలని ఆయన అన్నారు. ఈ బందు కార్యక్రమంలో అందే అశోక్. సుధాకర్, అందే బీరయ్య, బుట్టి సత్యనారాయణ, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.