Take a fresh look at your lifestyle.

కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

వెల్గటూర్, ముద్ర: జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం లోని కోటిలింగాల గ్రామంలో గల ” శ్రీ పార్వతి, కోటేశ్వర స్వామి” ఆలయ కమిటీ నియామకం జరిగింది. ఈ మేరకు ఆలయ కమిటీ చెర్మన్ గా మండలంలోని కిషన్ ర్రావ్ పేట గ్రామానికి చెందిన “పుదారి రమేష్” నియమితులయ్యారు. కాగా ఆలయ కమిటీ “డైరెక్టర్లు” గా వెల్గటూర్ కు చెందిన గుమ్ముల వెంకటేష్, కొత్తపేటకు చెందిన గోనె రాజిరెడ్డి, కోటిలింగాలకు చెందిన రాపాక రాజకోటయ్య, ఎండపల్లికి చెందిన దేవి లావణ్య మొక్క రావు పేటకు చెందిన బుద్దే రవి, చర్లపల్లే కు చెందిన మెరుగు శ్రీనివాస్ లు నియామకం అయ్యారు. కాగా దీనికి సంబందించిన నియామకపు పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పుదారి రమేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం తో ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించిన రాష్ట్ర ఎస్సి, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, తన నియామకానికి సహకారించిన ఉమ్మడి వెల్గటూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శైలందర్ రెడ్డి, ఎండపల్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి , మండల కాంగ్రెస్ నాయకులకు, కృతజ్ఞతలను తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.