ముద్ర మల్కాజిగిరి
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, బానోతు ఈశ్వర్ (23), బానోతు కవిత (57) మరో మైనర్ బాలుడు నాగాయన్‌పల్లి తండా, తుర్కపల్లి నివాసితులు.
బుధవారం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో న్యూ విద్యానగర్ ప్రాంతంలో అశోక్ లేలాండ్ గూడ్స్ ఆటోలో 96 బస్తాల పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఎస్ఓటీ ,నేరేడ్మెట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు.నేరేడ్మెట్‌లో అక్రమ పిడిఎస్ బియ్యం రవాణా పట్టివేత