మొయినాబాద్, ముద్ర విలేకరి: భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీసీలదే రాజాధికారం అని చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్ ప్రామైన భీమ్ భారత్ అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్ గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ను ప్రకటించిన ప్రకారం బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కల్పించడం జరుగుతుందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ను క్యాబినెట్లో ఆమోదించడం జరిగిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీసీ డిక్లరేషన్ లో ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగిందని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దేశంలో సగానికి పైబడిగా బీసీ జనాభా ఉన్న వారికి రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాలపరంగా సామాజిక న్యాయం జరగాలని లక్ష్యంతోనే రిజర్వేషన్ ఆడినెన్సీను తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం కంకరం కట్టుకుందని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తమ్మల మానెయ్య, మాజీ సర్పంచులు పురాణం వీరభద్ర స్వామి, సత్యనారాయణ, మాజీ ఎంపిటిసిలు మాధవరెడ్డి, గణేష్, కాంగ్రెస్ బిసి సెల్ మండల అధ్యక్షుడు కుమ్మరి వెంకటేష్, నాయకులు మహేందర్ రెడ్డి,నిరంజన్ గౌడ్,గుర్రాల భాస్కర్, మీనాజుద్దీన్, విఠల్, కరణ్, జయరాం రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.