Take a fresh look at your lifestyle.

అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలి 

  • జిల్లా వైద్యాధికారి వెంకటరమణ .

వికారాబాద్, ముద్ర విలేకరి : అన్ని రకాల మందులను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని గురువారం ఆయన తనిఖీ చేశారు.ఆసుపత్రిలో కేంద్ర మందుల యూనిట్ ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. మందుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు.జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇండియన్ టు ప్రకారం మందులను సరఫరా చేయాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మరింత మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.