ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం లోని ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఇటీవల నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మండల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన జర్నలిస్ట్ గుర్రాల నాగరాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు తోటి జర్నలిస్ట్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని ప్రజా సమస్యలు వెలికి తీసి అధికారుల ప్రజా ప్రతినిదుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.