Take a fresh look at your lifestyle.

24 న పెన్షనర్ల జిల్లా కౌన్సిల్ సమావేశం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నిర్మల్ జిల్లా కౌన్సిల్ సమావేశం ఈ నెల 24 న జరగనుందని జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న తెలిపారు. ముధోల్ ,బైంసా ,ఖానాపూర్, నిర్మల్ యూనిట్ల కార్యవర్గ సభ్యులందరూ 25 న ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు. హెల్ప్ ఏజ్ ఇండియా వారిచే వయోవృద్ధుల సంరక్షణ చట్టం సైబర్ నేరాల పట్ల పాటించవలసిన జాగ్రత్తలు, సీనియర్ సిటిజన్స్ మరియు పెన్షన్లకు సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలపై హెల్ప్ ఏజ్ ఇండియా ప్రతినిధి శ్యామ్ చే అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. సీనియర్ సివిల్ జడ్జ్, డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాధిక, అదనపు కలెక్టర్ మరియు జిల్లా సంక్షేమ అధికారి ఫైజాన్ రానున్నారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పెన్షనర్లు రావాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.