Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు… బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి…

 

కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ శ్రేణుల దాడి వాళ్ల అరాచకాలకు నిదర్శనం..

* లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది..శాంతి భద్రతలను పరిరక్షించలేని చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం

రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

 

 

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడి కాంగ్రెస్ శ్రేణుల అరాచకానికి నిదర్శనమని, కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల్ల ప్రవర్తిస్తున్నారని , రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తల దాడులు దౌర్జన్యాలు , అరాచకాలు సర్వసాధారణమైపోయాయని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి అన్నారు. కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని నిరసిస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ను అక్రమంగా అరెస్టు చేయడాన్నీ ఖండిస్తూ బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రోజున కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పిందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ అట్టి పెట్టుకొని శాంతి భద్రతలను పరిరక్షించలేని దారుణ స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.శాంతి భద్రతలను పరిరక్షించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల రౌడీయిజం రాష్ట్రంలో పెరిగిపోయిందన్నారు. నిత్యం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల అరాచకాలు , దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాడులు దౌర్జన్యాల సంస్కృతులను పెంచి ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసిన కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగుగ్గిలపు రమేష్,ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, నరసింహ రాజు
కార్పొరేటర్లు బోయిన్పల్లి ప్రవీణ్ రావు,బండ రమణ రెడ్డి
సోమిడీ వేణు ప్రసాద్,
బండారి వేణు,సౌగాల కొమురయ్య,నాంపల్లి శ్రీనివాస్ తాటి ప్రభావతి
ఎన్నం ప్రకాష్ .కోడూరి చంద్ర బిజెపి మీడియా కన్వీనర్ కటకం లోకేష్ ,లోకేష్ నాయకులు వుగెలే సుధాకర్,    దాసరిరమణరెడ్డి
తణుకు సాయి ,కుంట తిరుపతి
జాడి బల్ రెడ్డి,అడిచేర్ల రాజు
ఉప్పర్పెల్లి శ్రీను,
లడ్డూ ముందాడ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.