విద్యాశాఖ మంత్రిగా దేశాన్ని అక్షరాస్యత వైపు నడిపించిన అబుల్ కలాం – సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
యుజిసి, ఐఐటి విద్యాసంస్థలను నెలకొల్పి అభివృద్ధికి బాటలు వేసిన అబుల్ కలాం ఆజాద్ – డిసిసి మైనారిటీ సెల్ చైర్మన్ యం.డి. తాజుద్దీన్
మక్కాలో జన్మించి స్వాతంత్ర సమరయోధులుగా చరిత్రలో నిలిచిన అబుల్ కలాం. – మాజీ యం. పి.టి.సి పాషా
రెండు సార్లు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా అబుల్ కలాం పార్టీకి చేసిన సేవలు మరువలేనివి – నగర కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ అహ్మద్ అలీ

ఫిబ్రవరి 22, డిసిసి కార్యాలయం, కరీంనగర్
మాజీ కేంద్ర విద్యా శాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయం తో పాటు నగరంలోని బొమ్మకల్ బైపాస్ అబుల్ కలాం విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
మొదట డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు హాజరై పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం నగరంలోని బొమ్మకల్ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద నగర కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు అహ్మద్ అలీ, మాజీ యంపిటిసి పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్. ఏ.మోసిన్, సొసైటీ మెంబర్ సర్వర్ ఖాన్, డిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్. కె. సిరాజ్ హుస్సేన్, యం.డి.ఇమ్రాన్ హాజరై అబుల్ కలాం విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,యం.డి.తాజుద్దీన్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు స్వాతంత్ర అనంతరం ఏర్పాటైన ప్రభుత్వంలో రెండు పర్యాయాలు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి నాడు కేవలం 10% ఉన్న నిరక్షరాస్యతను నిర్మూలించి ఈ దేశంలో యు.జి.సి, ఐఐటి ఎయిమ్స్ లాంటి ఎన్నో విద్యాసంస్థలను స్థాపించి దేశాన్ని విద్యారంగం వైపు నడిపించి ఒక దిక్సూచిలా పనిచేసిన ఆ మేధావి. పవిత్రమైన మక్కాలో జన్మించిన అబుల్ కలాం గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారి చేత 10 సంవత్సరాలు కాలాపాణీలో జైలు జీవితం గడిపి ఈదేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1995 లో వారి మరణానంతరం భారత రత్న బిరుదుతో సత్కరించడం జరిగింది. రెండు సార్లు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేసిన అబుల్ కలాం చూపిన బాటలో నడవడానికి మేమంతా కలిసికట్టుగా నడుస్తూ వారు చేసిన అభివృద్ధిని ఈ దేశానికి చేసిన సేవలను భావితరాల వారికి తెలియజేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఖమ్రోద్దీన్, అక్రమ్, నిహాల్ అహ్మద్, లయిక్, సలీమొద్దీన్, ఇక్రమ్, ఖాజా ఖాన్, ఆరీఫ్ ఖాన్, బషీర్, అబ్దుల్ భారీ, సలీం, అబ్ధుల్ కరీం, అజ్మత్, జమీల్, శ్రీరాముల రమేష్, శివ ప్రసాద్, జీడి.రమేష్, అజీమ్, వంగల విద్యాసాగర్, కుంభాల రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.