Take a fresh look at your lifestyle.

మేరీ మాత విగ్రహాన్ని తొలగించిన నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న మేరీ మాత విగ్రహాంపై దాడి చేసి, విగ్రహాన్ని తొలగించి, కింద పడేసి అవమానపరిచిన నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మతసామరస్యంతో అందరు కలిసిమెలిసి ఉంటున్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మతాల మధ్యన చిచ్చు పెట్టి మత సామరస్యాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తున్న మతోన్మాద దుండగులను గుర్తించి వారిపై కఠినమైన చర్యలను తీసుకోవాలి పోలీసు యంత్రాంగానికి సూచించినారు. మేరీ మాత విగ్రహాంపై దాడి చేయడాన్ని ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా, మండల నాయకత్వం, గ్రామ ప్రజలతో కలిసి విగ్రహాన్ని జహంగీర్ పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, సిపిఎం మండల కార్యదర్శి, చీమల కొండూరు గ్రామ సర్పంచ్ పల్లెర్ల అంజయ్య, జమ్మాపురం గ్రామం సర్పంచ్ చిన్నబత్తిని లూర్దయ్య, తోగడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిన్నబత్తిని బాలరాజు, సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, కొండమడుగు నాగమణి, గ్రామ ఉప సర్పంచ్ విజయరాణి, ప్రజలు సరూప రాణి, సునీత, సుందరి, మరియమ్మ, జోసెఫ్, అంతోని, జార్జీ, చిన్నయ్య, ప్రసాద్, సిస్టర్ జోసెఫ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.