Take a fresh look at your lifestyle.

అనర్హులకు వడ్డెర కార్పొరేషన్ బాధ్యతలు

ముద్ర, యాదగిరిగుట్ట :
కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షదాయకమని, వడ్డెర హక్కుల సాధన కోసం పని చేయని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ మాత్రం కృషి చేయని వ్యక్తులకు చైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించడం సమంజసం కాదని తెలంగాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు
కోడిదెల అంజయ్య అన్నారు. వడ్డెర కులస్తుల క్షేత్ర స్థాయి స్థితిగతుల పై అవగాహన లేని వ్యక్తులకు అవకాశం ఇవ్వడం వల్ల జాతి పురోగతి అనుకున్న స్థాయిలో జరగదన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్టు సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వడ్డెర సంఘం పెద్దలు, ముఖ్యుల నుండి అభిప్రాయ సేకరణ జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తమకు ఆవేదన కలిగించిందన్నారు. గుంజ రేణుక, బత్తుల వెంకటేష్ బాధ్యతలు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం లాభం చేకూరదన్నారు. కాంగ్రెస్ నే నమ్ముకొని ముందుకు సాగుతున్న నిఖార్సైన వడ్డెరలకు అవకాశం దిశగా అడుగులు వేయాలని, తాజా నియామకం పై కాంగ్రెస్ పార్టీ పెద్దలు పునరాలోచించాలని సూచించారు. ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ అధ్యక్షుడు పల్లపు. నగేష్, పల్లపు ప్రదీప్, శివరాత్రి నవీన్, సాయి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.