Take a fresh look at your lifestyle.

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ V108A మొదటి క్యాబినెట్ సమావేశం – గవర్నర్ కలిమిచెర్ల రమేష్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V108A ఆధ్వర్యంలో మొదటి క్యాబినెట్ సమావేశం కల్వకుర్తి పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాసులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించి, డిస్ట్రిక్ట్ V108Aను రాబోయే కాలంలో మొదటి స్థానంలో నిలిపేలా క్లబ్ అధ్యక్షులు, అధికారులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
క్యాబినెట్ సెక్రటరీ చంద్రశేఖర్ క్యాబినెట్ ట్రెజరర్ శ్రీనివాసులు క్యాబినెట్ సర్వీస్ సెక్రటరీ బాదం శివకుమార్
జిల్లా స్థాయి అధికారులు, వాసవి క్లబ్ వనిత క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ V108A గవర్నర్ కలిమిచెర్ల రమేష్ జిల్లా బాధ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధికారులకు సర్టిఫికెట్లు, మెమెంటోలు, పిన్స్ అందజేశారు.
సమావేశంలో క్లబ్ అభివృద్ధి, సేవా కార్యక్రమాల విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై దిశ నిర్దేశం చేశారు

Leave A Reply

Your email address will not be published.