Take a fresh look at your lifestyle.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

 జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, శాంతియుతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.
గురువారం వికారాబాద్ పట్టణంలో ఎస్ ఎ పి కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని, కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అనుమతి ఉన్న సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లకే ప్రవేశం ఉంటుందని, 34 వార్డ్స్, 12 టేబుల్స్, ఒక సూపరింటెండెట్, ఇద్దరు అసిస్టెంట్ లు ఒక టేబుల్ కు ముగ్గురు చొప్పున ఏర్పాటు చేస్తునట్లు , కౌంటింగ్ హాలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలనీ, ఎట్టి పరిస్ద్తితుల్లో మొబైల్ ఫోన్ అనుమతి లేదని అధికారులకు ఆదేశించారు.
కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8.00 గంటలకు ప్రారంభమై, నిర్ణీత దశలవారీగా కొనసాగుతుందని తెలిపారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, విద్యుత్ బ్యాకప్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, అభ్యర్థులు వారి ప్రతినిధులు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కౌంటింగ్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీడియా ద్వారా తెలియజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ విక్రం సింహరెడ్డి, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.