Take a fresh look at your lifestyle.

అర్హులైన లబ్ది దారులందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

  • తాటికొండ సీతయ్య టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు.

ముద్ర, తుంగతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పధకం లో రాజకీయా లతో సంభంధం లేకుండా అర్హులైన అందరికి ఇండ్లు ఇవ్వాలని బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో తుంగతుర్తి మెయిన్ రోడ్డు సెంటర్ లో నిరసన తెలియ చేస్తూ ధర్నా కార్యక్రమంనిర్వహిం చారు. అనంతరం మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పధకం లో సీబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా అందరికి ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేతిరెడ్డి గోపాల్ రెడ్డి, మండల నాయకులు గుడిపాటి వీరయ్య, గునిగంటి యాదగిరి, బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, కొండగడుపుల వెంకటేష్, కొల్లూరి మహేందర్, పులుసు ఉప్పలయ్య, అకారపు భాస్కర్,లాకావత్ దశరద, గోపగాని వెంకన్న, ప్రసాద్, కొండగడుపుల నాగయ్య, షేక్ జూనీ, సిమ్మాద్రి, బెడదరాములు, పూన్య నాయక్వీ, రన్న నాయక్, యాకో నాయక్, సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.