ముద్ర ప్రతినిధి, నిర్మల్: నేరాలను అదుపు చేసేందుకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భైంసా అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా రూరల్ మీర్జాపూర్ లో సోమవారం రోజు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. భైంసా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నైలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తగిన ద్రువ పత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలను, 3 త్రిచక్ర వాహనాలను స్వాధీనపరచుకున్నారు.ఈ సందర్భంగా అవినాష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అన్నారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదన్నారు. యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్ కు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. భైంసా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నైలు, ఎస్ఐ లు రవీందర్, అశోక్, ప్రొబేషనరీ ఎస్ఐ సుప్రియ, పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.