Take a fresh look at your lifestyle.

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

  • ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు.
  • నాగర్ కర్నూల్ శాసనసభ్యులు Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో రాష్ట ప్రభుత్వం తరుపున నాగర్ కర్నూల్ శాసనసభ్యులు Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి. మాట్లాడుతూ..పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిష్టతో కఠిన ఉపవాసాన్ని ఆచరిస్తారని పేర్కొన్నారు.ఈ రంజాన్ మాసం సమాజంలో సామరస్యాన్ని, సంతోషాన్ని, సౌబ్రాతృత్వాన్ని పెంపొదిస్తుందని తెలిపారు.కులమతాలకు అతీతంగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.విచ్చేసిన ముస్లిం సోదర సోదరీమణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అదేవిధంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి సంక్షేమం కొరకు ప్రభుత్వం తోడ్పడుతుందని తెలియజేశారు.అలాగే మైనారిటీ సోదరిమనులకు 200 కుట్టు మిషన్లు ప్రభుత్వం తరఫున అందజేస్తామని తెలియజేసరూ.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మాజీ కౌన్సిలర్ శ్రీను, RDO, MRO, డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, మున్సిపాలిటీ కమిషనర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, తిరుపతి గౌడ్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.