Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ సేవాతత్పరతతో ముందుంటున్న పూజారి బూర్గుల నరసింహారావు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్‌కు చెందిన పూజారి బూర్గుల నరసింహారావు 2014 సంవత్సరం నుంచి ప్రతి నెలలో ఒక రోజు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
దత్త జయంతి, కార్తీక పౌర్ణమి, అమావాస్య, పౌర్ణమి వంటి ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా నెలలో ఒక రోజు సుమారు 150 మంది రోగి సహాయకులకు అన్నప్రసాదంతో పాటు స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
చైత్ర అమావాస్య సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా తన సేవా భావాన్ని మరొకసారి చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో తులసి శర్మ, హర్ష, నందు, హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.