Take a fresh look at your lifestyle.

అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలి -అదనపు జిల్లా కలెక్టర్ ఉమా శంకర్

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

సదరం సర్టిఫికెట్ కు అర్హులైన వారందరికీ మంజూరు అయ్యేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో సదరం క్యాంపుల నిర్వహణ, యుడిఐడి పోర్ట్ లో అప్లోడ్ పై డిపిఎం, ఏపీఎంలతో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సదరం సర్టిఫికెట్ కొరకు చేసుకున్న దరఖాస్తులన్నీ యూడిఐడి పోర్టులో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. సదరం క్యాంపుకు ఎక్కువ మొత్తంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ తక్కువ మంది క్యాంపులకు హాజరవుతున్నారనే విషయాన్ని అదనపు కలెక్టర్ గుర్తించారు. ఆధార్ సర్టిఫికెట్ కొరకు స్లాట్ బుక్ చేసిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా సమాచారాన్ని ఇచ్చి క్యాంపులకు హాజరు అయ్యేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన సూచించారు. డిఆర్డిఏ ద్వారా చేపట్టే వివిధ కార్యక్రమాల గురించి ఆయన ఆరా తీశారు. సమీక్ష సమావేశంలో డిఆర్డిఏ శ్రీనివాస్, డిప్యూటీ డిఆర్డిఏ నర్సింలు, డిపిఎం మహేష్, ఏపిఎంలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.