Take a fresh look at your lifestyle.

తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన వికారాబాద్ జిల్లా కుమ్మర సంఘ నేతలు

ముద్ర, తాండూర్ ప్రతినిధి :

ఆర్థికంగా, రాజకీయంగా సామాజికంగా చాలా వెనుకబడి అట్టడుగు స్థానంలో ఉన్న కుమ్మర కులస్తులను రాజకీయ పార్టీలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వికారాబాద్ జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షులు మారుతి పేర్కొన్నారు. ఆదివారం రోజున ఉస్మానియా యూనివర్సిటీ లో నిర్వహించిన 33 జిల్లాల కార్యవర్గ సమావేశానికి జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షులు మారుతీ సార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కుమ్మర కులస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షులు నుడికుడి జయంత్ రావు ఆధ్వర్యంలో త్వరలోనే హైదరాబాద్ లో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించి కుమ్మరుల ఐక్యతను చాటుత మని పిలుపునిచ్చారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుమ్మర కులస్తులను బిసిబి జాబితా నుండి బీసీ ఏ జాబితాలో చేర్చాలని , చట్టసభల్లో కుమ్మర కులస్తులకు ప్రాధాన్యత నివ్వాలని, లేనిచో త్వరలోనే హైదరాబాద్ లో రెండు లక్షల కుమ్మర కులస్తులతో భారీ బహిరంగ సభ నిర్వహించి మా యొక్క సత్తా చాటుతామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కుమ్మరి సంఘం నాయకులు మారుతీ, నారాయణ, అంజిలయ్య, ఎల్ఐసి శ్రీనివాస్, సత్తయ్య, రఘు,బుగ్గప్ప, రవి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.