ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తిరిగి ఈ నెల 23 నుంచి ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతులు, ఫిర్యాదులు సమర్పించదలిచిన వారు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై నేరుగా అధికారులకు తమ దరఖాస్తులను అందజేయవచ్చని పేర్కొన్నారు. జిల్లావాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.