Take a fresh look at your lifestyle.

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ

ముద్ర, యాదగిరిగుట్ట :

తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శనివారం దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు.

తెల్లవారుజామున 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి పాదాలకు ఈవో భవాని శంకర్ ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. భక్తులు స్వామివారి కొండ చుట్టూ రెండున్నర కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ చేసిన అనంతరం భక్తులు కాలినడకన కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎస్పీఎఫ్ ఆర్ ఐ శేషగిరిరావు, ఎస్సై రవి సిబ్బంది నందు నాయక్ రమేష్ హోంగార్డు భాస్కర్ స్థానికులు భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.