- అంబేద్కర్ కృషి తోనే అన్ని వర్గాలు సమాన హక్కులు పొందుతున్నారు
- మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పహల్గావ్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ప్రతి భారతీయుడి ఖండించాలని, పాకిస్తాన్ భారత దేశం పై దొంగ దెబ్బ తీస్తోందని, దేశ ఐక్యత, సార్వభౌమత్వం కాపాడుకునేందుకు పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం ధరూర్ లో సోమవారం జై బాపు..జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా జీవన్ రెడ్డి ఆద్వర్యంలో ధరూర్ శివారులోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ కృషి తోనే అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగ రచన తోనే సమాన హక్కులు పొందుతున్నారని, రాష్ట్రాల ఏర్పాటు,కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు రాజ్యంగంలో పొందుపర్చారని, నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చలువేనని, కేంద్ర ప్రభుత్వ మంత్రిగా అమిత్ షా అంబేద్కర్ ను అవమానించడం భారత సమాజాన్ని అవమానించడమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో జై బాపు..జై భీమ్, జై సంవిధా న్ పరిశీలకులు అంజన్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జీవన్ రెడ్డి పదవులకే వన్నె తీసుకు వచ్చారని, మంత్రిగా కరీంనగర్ నుండి హైదరాబాద్ కు రాజీవ్ రహదారి, ఊరూరా రోడ్లు, కరీంనగర్ నుండి జగిత్యాల్ డబుల్ రోడ్డు వేశారన్నారు.జీవన్ రెడ్డి జన నాయకుడు, ఎమ్మెల్సీగా బీ ఆర్ ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగట్టి, పోరాటం చేశారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శీలం సురేందర్, కొలుగూరి శివ కుమార్, శీలం మల్లేశం, నర్సయ్య, బండ శంకర్ గాజంగి నందయ్య, గోపి రాజిరెడ్డి, కల్లేపల్లి దుర్గయ్య, జున్ను రాజేందర్, కొం డ్ర జగన్, చాంద్ పాషా, గంగాధర్, మహేష్, చందా రాధ కిషన్, నరేష్, రాజిరెడ్డి, రాజశేఖర్, రఘువీర్ గౌడ్, గుండా మధు, నల్ల స్వామి రెడ్డి, సింగరావు, మొగిలి, ముఖేష్ పాల్గొన్నారు.
