Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని 15వ వార్డు శంకులపల్లిలో మేప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల ఏమ్మేల్య్హే డా. సంజయ్ కుమార్ ప్రారంబించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15వ వార్డు లో 85 లక్షలతో అత్యంత ఆవశ్యకం కలిగిన డ్రైనేజీ నిర్మాణం చేశామని, వార్డు లో వాటర్ ట్యాంక్ ఏర్పాటుతో మంచినీటి సరఫరా ఇబ్బంది లేకుండా జరుగుతుందన్నారు.జగిత్యాల అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాని, పట్టణ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిరుపేదలకు వరమన్నారు. ఏకకాలం లో 20 వేల కోట్ల రుణ మాఫీ అమలు చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే, సన్న వడ్లకు 500 బోనస్ తో రైతులకు లబ్ది చేకూరుతుందని, ఈ ప్రభుత్వం రైతు పక్ష పాతి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన,  గిరి నాగభూషణం, అడువల లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, బాల ముకుందం, తోట మల్లికార్జున్, మెప్మ ఎఒ శ్రీనివాస్, ఎ ఈ అనిల్ , చెట్పల్లి సుధాకర్, బోడ్ల జగదీష్, కుసరి అనిల్, కూతురు రాజేష్, పిట్ట ధర్మరాజు, కత్రోజ్ గిరి, శరత్ రావు, ములసపు మహేష్,ఏనుగుల రాజు, లింగారెడ్డి, కుసరి రాజు, రంగు మహేష్, రవి, రవి శంకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.