ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో మహిళ కడుపునుంచి 6 కిలోగ్రాముల భారీ కణితిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. వివరాలిలా ఉన్నాయి.ముధోల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన చిన్నమ్మ (58) అనే మహిళ తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరింది. ఆమెకు టెస్టులు చేసిన డాక్టర్లు రిపోర్టులు చూసి షాకయ్యారు. సదరు మహిళ కడుపు లో భారీ కణితిని గుర్తించారు.డాక్టర్లు అపూర్వ రజనీకాంత్, ప్రీతి నేతృత్వంలో ప్రత్యేక డాక్టర్ల బృందం ఆ మహిళకు శస్త్ర చికిత్స నిర్వహించింది. సుమారు రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్ ద్వారా 6 కిలోల పెద్ద కణితిని తొలగించి మహిళ ప్రాణం నిలబెట్టారు.