Take a fresh look at your lifestyle.

బసవేశ్వర జయంతి ఉత్సవ కమిటీ ఏర్పాటు

  • కమిటీ సభ్యులుగా గుంటి జగదీశ్వర్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మహాత్మ బసవేశ్వర జయంతిని ఈనెల 30 న అధికారికంగా జరుపాలని భావించి రాష్ట్ర ప్రభుత్వం 22 మందితో ఒక ఉత్సవ కమిటీని నియమించింది.హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బసవ జయంతిని నిర్వహించేందుకు గాను ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని అందులో భాగంగానే ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఉత్సవ కమిటీ చైర్మన్ గా జాహిరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ తో పాటు జగిత్యాల కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ న్యాయవాది గుంటి జగదీశ్వర్ తోపాటు 22 మందితో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.జగదీశ్వర్ నియామకం పట్ల జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు.కమిటీ సభ్యులుగా నియామకం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జాహిరాబాద్ ఎంపీ, కమిటీ చైర్మన్ సురేష్ శెట్కార్ కు జగదీశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.