Take a fresh look at your lifestyle.

నిర్మల్ డీఎస్పీగా శ్రీనివాస్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ సబ్ డివిజన్‌ డి ఎస్పీగా పి.శ్రీనివాస్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా.జి.జానకి షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ, నూతన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేశారు. విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. అలాగే నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా స్పందించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.