- భువనగిరి ముదిరాజ్ బోనాల ఉత్సవ కమిటీ నిర్ణయం.
ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ పరిధిలో ఈనెల 16న శ్రీ పెద్దమ్మ తల్లి కి, 17న ఆయా వార్డులలో ఉన్న గ్రామ దేవతలకు బోనాలు సమర్పించాలని ముదిరాజ్ బోనాల ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఆదివారం స్థానిక కిసాన్ నగర్ లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ సమీపంలో ముదిరాజ్ బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వివిధ వార్డుల ముదిరాజ్ పెద్ద మనుషులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ పెద్ద మనుషులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ముదిరాజు బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. భువనగిరి మున్సిపల్ పరిధిలోని వార్డులు, గ్రామాల వారు ఆగస్టు 16న పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. బోనాల సందర్భంగా పట్టణంలోని గ్రామదేవతల గుడుల వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య పనులను చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ను విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ కుల పెద్దల ఆధ్వర్యంలో బోనం పెద్దమ్మ తల్లికి శనివారం ఉదయం ఏడు గంటలకు సమర్పిస్తామని తెలిపారు. బోనాల సందర్భంగా బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ అలంకరణ, భక్తులకు ఉచితంగా ప్రసాదం, మంచినీరు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 16న ప్రత్యేక పూజలు తో బోనాల సమర్పణ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముదిరాజులతోపాటు ఇతర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం లో నాయకులు కొలుపుల వివేకానంద, గపెంట నరసింహ, కుక్కదూగ సోమయ్య, గోర్రెంకల శివశంకర్, సాధు విజయకుమార్, గుర్రాల శివ నాగేందర్, బీస్కుంట్ల సత్యనారాయణ, ఎనబోయిన జహంగీర్, నీల శ్రీనివాస్, ఈర్ల వెంకటేష్, తుపాకుల సురేష్, శాగంటి నర్సింహా, మేడ బోయిన రాము, ఉడుత రమేష్, మంద బాబు, మంద నర్సింగ్ పాల్గొన్నారు.