- పెంపుడు కుక్కలను హింసిస్తున్న నిర్వాహకులు.
- ధనార్జన ధ్యేయంగా సైనిక్ పెట్పాస్.
- ఎలాంటి అనుమతులు లేకుండా పెట్ పాస్ నిర్వహణ.
- అధికారుల పర్యవేక్షణ శూన్యం రెచ్చిపోతున్న పెట్ నిర్వాహకులు.
- పెంపుడు కుక్కలకు ఏ వైరస్ వచ్చిన సంబంధం లేదంటూ పైశాచిక ఆనందం.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎలకలపల్లి గ్రామ సమీపంలో సైనిక్ పెట్పస్ బోర్డింగ్ ట్రైనింగ్ గ్రూమింగ్ పెట్ సామాగ్రి మెడికల్ క్లినిక్ లాంటి సౌకర్యాలు ఉంటాయని పెంపుడు కుక్కలను తీసుకుంటూ బోర్డింగ్ పేరిట ప్రతిరోజు 500 రూపాయలు వసూలు చేస్తూ పెంపుడు కుక్కల ప్రేమికులను నిలువునా ఆర్థికంగా దోచుకుంటూ పెంపుడు కుక్కలను హింసిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న నిర్వాహకుల వైనం ఇది.ఆర్మీలో కుక్కల ట్రైనింగ్ విధులు నిర్వహించి ఎక్స్ ఆర్మీ ఒకరు పెట్పాస్ పెంపుడు కుక్కల సంరక్షణ కేంద్రం నేలకొల్పి పెంపుడు కుక్కలకు కేర్ టేకర్ గా తీసుకోవాల్సిన బాధ్యతలు విస్మరించి ధనార్జన ముఖ్యంగా ఎలాంటి అర్హతలు లేని ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన వారిని పెంపుడు కుక్కల కేంద్రంలో నియమించి వాటికి తిండి పెట్టకుండా అరుస్తున్నాయంటూ విపరీతంగా కొడుతూ హింసిస్తూ మూగజీవాల కాళ్లు విరగ్గొడుతున్నారు మూగజీవాలపై విచక్షణారహితంగా కొడుతూ కనికరం లేకుండా మానవత్వం లేకుండా పెంపుడు కుక్కలను వాటి యజమానులకు ఇవ్వకుండా బోర్డింగ్ పైసలు వసూలు చేసిన తర్వాతనే పెంపుడు కుక్కలను చూపిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. పెంపుడు కుక్కల ప్రేమికులు తాము ఇష్టంగా పెంచుకున్న కుక్కలను పెళ్లిళ్లని ఇతర కారణాలు శుభకార్యాలు కోసం వాటిని ఎలకలపల్లిలోని ఒకే ఒక సైనిక్ పెట్పస్ కేంద్రంలో అప్పచెప్తూ వెళ్తున్నారు ఇదే అతనుగా భావించిన నిర్వాహకులు పెంపుడు కుక్కల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు అనే ఉద్దేశ్యంతో ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని పెంపుడు కుక్కల యజమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సైనిక్ పెట్పాస్ నెలకొల్పిన ఎక్స్ ఆర్మీ యజమాని వేరే ఉద్యోగం చేస్తూ పెట్పాస్ నిర్వహణలో అనుభవం లేని వ్యక్తిని పెట్టి మూగజీవాలను హింసిస్తూ వచ్చిరాని వైద్యం చేస్తూ డబ్బులు వసూలు చేస్తూ సరైన నిర్వహణ కుక్కల సంరక్షణ లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా పెట్పాస్ నిర్వహిస్తున్నారు. తమ పెంపుడు కుక్కలు పెట్ పాస్ లో ఆరోగ్యంగా రక్షణతో ఉంటాయని భావించిన వారికి నిరాశ మిగులుతుంది పెట్పాస్ తీసుకొచ్చిన కుక్కలకు వైరస్ లోకి వాటి కాళ్లు విరిగి వైద్యానికి అయ్యే ఖర్చు ఇప్పుడు కుక్కల యజమానులు అదనంగా భరిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఓకే పెట్పస్ ఉండడం తో గత్యంతరం లేక పెంపుడు కుక్కల యజమానులు వారి పనుల అవసరాల నిమిత్తం ఈ కేంద్రంలో ఇస్తున్నట్లు తెలిపారు.పెట్పస్ నెలకొల్పడానికి కావలసిన అనుమతులు నియమ నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి, ఎన్ఓసి సర్టిఫికెట్, బోర్డింగ్ లైసెన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ అనుమతి, పెట్పస్ బిల్డింగ్ సేఫ్టీ సర్టిఫికెట్,ఇరుగు పొరుగు వారితో అనుమతి పత్రం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి,అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ అనుమతి,గ్రూమింగ్ షార్ప్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్, జిఎస్టి, వెటర్నరీ క్లినిక్ కోసం రిజిస్టర్ వెటర్నరీయన్,బీవీఎస్సీ అండ్ ఏ హెచ్ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రిజిస్టర్ అయి ఉండాలి,వెటర్నరీ మెడికల్ షాప్ కోసం రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ బి ఫామ్ ఆర్ డి ఫామ్,డ్రగ్ లైసెన్స్ ఫ్రమ్ స్టేట్ డ్రగ్ కంట్రోల్ ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ లాంటి అనుమతులు ఉండాల్సి ఉండగా ఇలాంటివి ఏమీ లేకుండా తూతూ మంత్రంగా పెంపుడు కుక్కల కేంద్రం ఏర్పాటు చేసి మూగజీవాల సంరక్షణ చేయకుండా కేవలం ధనార్జనే ప్రధానంగా గత కొన్నేళ్లుగా మోసం చేస్తూ నిర్వహిస్తున్న పెట్ పాస్ అనుమతి లేని వెటర్నరీ మెడికల్ షాప్ నిర్వహిస్తున్న నిర్వాహకుల పై అధికారుల పర్యవేక్షణ శూన్యంగా మారడంతో పెంపుడు కుక్కల కేంద్రం నిర్వాహకులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. మూగజీవాలను హింసిస్తూ వాటి కాళ్ళను విరగొడుతూ పైశాచిక ఆనందం పొందుతూ ఒక్కొక్క పెంపుడు కుక్క వైరస్ ఇంకో కుక్కకు వచ్చే విధంగా చేస్తూ వాటి సంరక్షణ చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమకు సంబంధం లేదంటూతప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే తాను ఆర్మీ అంటూ బెదిరిస్తూ పెంపుడు కుక్కల యజమానుల పైనే ఆజమాయేసి చేస్తూ దౌర్జన్యం గా వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా కలెక్టర్,పశుసంవర్ధక శాఖ మెడికల్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అధికారులు సేఫ్టీ అండ్ ఫైర్ ఉన్నత స్థాయి అధికారులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోకల్ బాడీస్ ఇన్చార్జి కమిషనర్ అదనపు కలెక్టర్, ప్రత్యేక అధికారి, పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ పేట్ పాస్ కేంద్ర నిర్వాహకుల పై చర్యలు చేపట్టి అనుమతులు లేని పేట్ పాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పెంపుడు కుక్కల యజమానులు అధికారులను కోరుతున్నారు.పెంపుడు కుక్కలను హింసిస్తున్న వ్యవహారంపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి పెట్పస్ కేంద్రాలను సీజ్ చేయాలని పెంపుడు కుక్కల యజమానులు మూగజీవాలు జంతు ప్రేమికులు కోరుతున్నారు.
